సూర్యప్రతాప్, మేఘనారాజ్ జంటగా నటిస్తున్న 'నంద నందిత' చిత్రం ఆడియో సీడీలు మార్కెట్లో విడుదలయ్యాయి. ఫ్రాంచ్ పిక్చర్స్ పతాకంపై చింతా శ్రీరామచంద్రారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌శివ దర్శకుడు. ఎమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చగా, భువనచంద్ర, భాస్కరభట్ల, విశ్వ, వెనిగళ్ల రాంబాబు సాహిత్యం అందించారు. సోమవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ఆర్.వి. రమణమూర్తి సీడీలను ఆవిష్కరించారు. రమణమూర్తితో పాటు అతిథులుగా హాజరైన దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్, దర్శకుల సంఘాధ్యక్షుడు వి. సాగర్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ 'నంద నందిత' పాటలు, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తెలుగు సినిమాకి సంగీతం సమకూర్చడం ఎంతో ఉద్వేగభరితంగా ఉందనీ, రచయితలు చక్కని పాటలు అందించారనీ సంగీత దర్శకుడు ఎమిల్ మొహమ్మద్ అన్నారు. దర్శకుడు రామ్‌శివ మాట్లాడుతూ "నిర్మాతని దృష్టిలో ఉంచుకుని తక్కువ టైమ్‌లో తెలుగు, తమిళ భాషలు రెండింటిలో ఈ చిత్రాన్ని రూపొందించా. హీరోగా సూర్యప్రతాప్ చక్కని నటన ప్రదర్శించాడు. వెన్నెలకంటి డైలాగ్స్ చాలా బాగా రాశారు. తప్పకుండా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకముంది'' అని చెప్పారు. దర్శకుడు తననుంచి మంచి నటన రాబట్టుకున్నారని హీరో సూర్యప్రతాప్ అన్నారు.
నిర్మాత శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ "కన్నడంలో ఈ సినిమా చూసి, బాగా నచ్చి తెలుగులో రీమేక్ చేస్తున్నా'' అన్నారు. కన్నడ చిత్రానికి మంచి మార్పులతో దర్శకుడు ఈ చిత్రాన్ని అందంగా రూపొందించారని నటుడు నాజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.ఆర్., సంభాషణల రచయిత వెన్నెలకంటి, గేయ రచయితలు వెనిగళ్ల రాంబాబు, విశ్వ, ఛాయాగ్రాహకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

No comments:
Post a Comment