#Label1 a:hover{ color:#666; background:none #fff; text-decoration:none; }
BannerFans.com

Much awaited movies

BannerFans.com BannerFans.com BannerFans.com BannerFans.com BannerFans.com " /> ">

Wednesday, 2 November 2011

'ఈగ'ని రెండు భాషల్లోనూ తీస్తున్నా

నాని, సమంత జంటగా ఎస్.ఎస్. రాజమౌళి 'ఈగ' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో 'నాన్ ఈ' పేరుతో రూపొందుతోంది.

అయితే ఇటీవల పలు వెబ్‌సైట్లలో 'నాన్ ఈ'ని తెలుగు సినిమాకి తమిళ వెర్షన్‌గా పేర్కొంటూ వార్తలు వచ్చాయి. దీనికి రాజమౌళి స్పందిస్తూ "ఆ వెబ్‌సైట్లు 'నాన్ ఈ'ని డబ్బింగ్ సినిమాగా పేర్కొనడం విచారం కలిగిస్తోంది. అది డబ్బింగ్ వెర్షన్ కాదు. తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రతి సన్నివేశాన్నీ చిత్రీకరిస్తున్నా.

ఇది ద్విభాషా చిత్రం'' అని స్పష్టం చేశారు. "విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు. మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి.

రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫౌల్డ్స్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్. రవీందర్, స్పెషల్ ఎఫెక్ట్స్: అడిల్, స్టైలింగ్: రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

No comments:

Post a Comment