'ఎల్‌బిడబ్ల్యూ' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్, బెంచ్ మార్క్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'రొటీన్ లవ్‌స్టోరీ' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 'ప్రస్థానం' నటుడు సందీప్ , రెజీనా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు చాణక్య బూనేటి, పి.మణికుమార్ మాట్లాడుతూ 'గత నెల 31న షూటింగ్ ప్రారంభించాం. ఈ నెల 27తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. డిసెంబర్‌లో ఉత్తరాంచల్‌లో రెండో షెడ్యూల్ ఉంటుంది. సినిమాలోని ఐదు పాటలను రికార్డ్ చేశాం. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ 'ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఓ లాజిక్‌తో బతికే కుర్రాడు అదే లాజిక్‌తో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నది చిత్ర కథాంశం. చాలా మంది తమ ప్రేమ చాలా డిఫరెంట్ అనుకుంటారు. కానీ కొన్ని అంశాలను గమనిస్తే తమదీ రొటీన్ ప్రేమకథే అనిపిస్తుంది. ఆ అంశాన్నే ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపిస్తున్నాం' అన్నారు.
ఎం.ఎస్.నారాయణ, కృష్ణుడు, జయప్రకాష్‌రెడ్డి, హేహ, సురేఖావాణి, ఝాన్సీ, మాస్టర్ భరత్, తాగుబోతు రమేష్, స్నిగ్ధ, స్వప్నక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, ఫొటోగ్రఫీ: సురేష్, ఛోటా కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అర్చన బూనేటి.

No comments:
Post a Comment