పృథ్వీరాజ్ హీరోగా; ప్రియమణి, మీరానందన్ హీరోయిన్లుగా రూపొందిన 'యమముదురు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన 'పుదియముగమ్' చిత్రానికి ఇది తెలుగు రూపం. ఇదివరకు పలు డబ్బింగ్ సినిమాల్ని అందించిన అడ్డాల వెంకట్రావు ఈ చిత్రాన్ని లక్ష్మీవెంకటేశ్వర మూవీస్ పతాకంపై అందిస్తున్నారు.
"వైవిథ్యమైన కథాంశంతో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. 'ఉరుమి' ఫేమ్ దీపక్‌దేవ్ సంగీత సారథ్యంలో రూపొందిన నాలుగు పాటల్ని హీరో హీరోయిన్లపై మనోరంజకంగా చిత్రీకరించారు. యాక్షన్ సన్నివేశాల్ని ఎంతో ఎమోషనల్‌గా తీశారు. కొచ్చి, పాలక్కాడ్, మలేసియాల్లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా కథనం నడుస్తుంది. పృథ్వీరాజ్‌కి మలయాళంలో స్టార్‌డమ్‌ని తెచ్చిన సినిమా ఇదే. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఇదే నెల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
బాల, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్, వెన్నెలకంటి, భాగ్యశ్రీ, సంగీతం: దీపక్‌దేవ్, ఛాయాగ్రహణం: భరణి కె. ధరన్, ఫైట్స్: అణల్ అరసు, నిర్వహణ: పి.వి. రమణ, సమర్పణ: ఎ.ఎం. రవితేజ్, దర్శకత్వం: దీపన్.
No comments:
Post a Comment