షాజీ కైలాస్ దర్శకత్వంలో మమ్ముట్టి ద్విపాత్రాభినయంతో మలయాళంలో రూపుదిద్దుకున్న 'ద్రోణ 2010' చిత్రాన్ని శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ 'ద్రోణాచార్య' పేరుతో తెలుగులోకి అనువదించింది. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సోషియో ఫాంటసీ కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిందని, కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకలకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. మల్లూరి వెంకట్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయని, రాజమణి నేపథ్య సంగీతం సినిమాకి హైలైట్ అవుతుందని చెప్పారు.
No comments:
Post a Comment